కల్లూరు మండలంలోని, అర్బన్ 37 వ వార్డ్ లో పాణ్యం నియోజవర్గ ఎమ్మెల్యే గౌరు. చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యూ ఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని, తదితర నాయకులతో, ప్రభుత్వ అధికారులతో కలిసి బిటి రోడ్ల పనులకు చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షురాలు & పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యూ ఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు మాట్లాడుతూ కల్లూరు అర్బన్ లోని, నూతన ఈద్గా నుండి ప్రియ హోమ్స్ వరకు మరియు వీకర్ సెక్షన్ కాలని ఆటో స్టాండ్ నుండి రేడియో స్టేషన్ వరకు వేస్తున్న బీటీ రోడ్ల పనులు రూ 1 కోటి 20 లక్షల నిధులతో వేయడం జరుగుతుందన్నారు. ఈరోజు వాటికి భూమి పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలని ప్రజలు తదితరులు పాల్గొన్నారు.