కర్నూలు : కర్నూలు జిల్లా కలెక్టరేట్‌ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, అధికారులతో, నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ & టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని లు మాట్లాడుతూ గాంధీజీ దేశానికి అందించిన సేవలను, అహింసా మార్గం ద్వారా స్వాతంత్ర్య సాధన కోసం చేసిన కృషిని మనమందరము ఈరోజు స్మరించుకుందాం అన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలు, సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చాను. గాంధీజీ చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొనడం జరిగింది.