పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, తహసిల్దార్ కార్యాలయం దగ్గర వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపి, కూటమి ప్రభుత్వం తక్షణమే గ్రామ రెవిన్యూ సహాయకుల డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య, మండల కో ఆప్షన్ నెంబర్ సయ్యద్. ముర్తుజాఅలీ, ఏపీ మోడల్ స్కూల్ పేరెంట్స్ కమిటీ మెంబర్ తలముడిపి మా భాష లు డిమాండ్ చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకు లు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 18 రోజులకు చేరుకుంది. ఈ మేరకు ఏపీ వడ్డెర సంఘం, వైసిపి నాయకులు కలిసి గ్రామ రెవెన్యూ సహాయకుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వి.రామసుబ్బయ్య, మండల కో ఆప్షన్ నెంబర్ సయ్యద్. ముర్తుజాఅలీ లు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు కనీస వేతనం 26,000/- ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే అర్హులైన వీఆర్ఏలకు వీఆర్వో, అటెండర్, వాచ్ మెన్ పోస్టుల్లో నియమించాలని డిమాండ్ చేశారు. నామినేలు గా పని చేస్తున్న వారసులను వీఆర్ఏలుగా నియమించాలని కోరారు. కూటమి ప్రభుత్వం 18 రోజులుగా గ్రామ రెవెన్యూ శాఖలు సమ్మె చేస్తున్న పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నేతలతో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అంతేకాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పే స్కేల్ వీఆర్ఏలకు తక్షణమే అమలు చేసి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మండల అధ్యక్షులు పరమేశ్వరుడు కార్యదర్శి నారాయణ కోశాధికారి మౌలాలి నాయకులు బోయ మధు పుల్లయ్య బాబు సాహెబ్ చంద్రుడు లతో కలిసి వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వీఆర్ఏ ల సంఘం పాములపాడు మండల అధ్యక్షులు సద్ధల పరమేశ్వరుడు, కార్యదర్శి కె.నారాయణ, కోశాధికారి డి.మౌలాలి, ఉపాధ్యక్షులు ఆర్.చంద్రశేఖర్ నాయక్, అన్ని గ్రామాలలో ఉన్న వీఆర్ఏల సంఘం కమిటి సభ్యులు ఆర్.శంకర్ గౌడ్, సంగెం.చంద్రుడు, షేక్.మాబు సాహెబ్, బషీర్ అహమ్మద్, పూల రంగడు, ఎల్.వెంకటయ్య, యోగేశ్వరరావు, అహమ్మద్ హుస్సేన్, లక్ష్మీదేవి, ఆరిఫా, మౌలాలి, నారాయణ నాయక్, జన్ను సాహెబ్, నాగన్న, మధుబాబు, పుల్లయ్య, సుబ్బరాయుడు, నాగరత్నం, చంద్రశేఖర్ నాయక్, వెంకటరమణ, పి.లక్ష్మి, వెంకటయ్య, శివశంకర్, వెంకటేశ్వర్లు, లక్ష్మీ నాయుడు, మల్లయ్య, నాగన్న, షంషీర్ భాష, పెద్ద ఈశ్వరయ్య స్వామి, పెద్ద లింగస్వామి, గోవర్ధన్, లావణ్య, పుల్లమ్మ, ముర్తుజా, లింగస్వామి, స్వామినాథం, ఎస్.బాషూ, శ్రీరాములు, తదితరులు పాల్గొనడం జరిగింది.

enivasnews.com





