పాములపాడు : రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్-25 నుండి అక్టోబర్-10 వరకు జరుగుతున్న అంగన్వాడి ఉత్సవం ప్రాగ్రామ్ లో భాగంగా పాములపాడు మండలంలోని, ఎర్రగూడూరు గ్రామములోని, 1వ, 2వ, 3వ అంగన్వాడి కేంద్రాలలో ఈరోజు జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ పి.లలిత ప్రభావతమ్మ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ పి.లలిత ప్రభావతమ్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బాలింతలు, గర్భవతులు, తల్లులు హాజరైన వారికి పీఎంఎంయూవై ప్రధానమంత్రి మాతృ వందన స్కీమ్ గురించి వివరించడం జరిగింది. అందులో తల్లులకు మొదటి డెలివరీకి 5000/- రూపాయలు వస్తాయని, పాప పుట్టిన బాబు పుట్టిన మొదటి విడత 3000/- పడతాయని, గర్భవతిగా నమోదు చేసుకున్నప్పుడు కనీసం ఒక్కసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఉండాలన్నారు. రెండవ విడత డెలివరీ అయ్యి శిశువు జననం నమోదు చేసిన తర్వాత మరియు 14 వారాల వరకు పూర్తిచేసిన తర్వాత 2000 రూపాయలు పడ్డాయన్నారు. రెండవ డెలివరికి అమ్మయి పుట్టినప్పుడు 6000 /- వేల రూపాయలు మాత్రమే పడ్డాయఖఖన్నారు. 

ఎర్ర గూడూరులో ఘనంగా అంగన్వాడి ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించిన సూపర్వైజర్ పి లలితా ప్రభావతమ్మ

తల్లి శిశువు ఆరోగ్యం మెరుగుపరుచటం కోసం, రక్తహీనత మరియు శిశుమరణాలు తగ్గించడం కోసం, ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించడం కోసం జరిగిన తల్లి మరియు శిశువుకు పోషక ఆహారం ప్రోత్సహించడం కోసం, మహీళలకు అర్థిక సాధికారత మొదలగు విషయాలపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సుజాత, ఈశ్వరమ్మ, సుజాత, ఈశ్వరమ్మ వెంకటలక్ని, ఆశ వర్కర్లు పద్మ, గర్భవతులు, పిల్లలు పాల్లొనడం జరిగింది.

ఎర్ర గూడూరులో ఘనంగా అంగన్వాడి ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించిన సూపర్వైజర్ పి లలితా ప్రభావతమ్మ