పాములపాడు : పాములపాడు మండలంలోని, మద్దూరు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ 21టి, ఐ 0948 నెంబర్ గల ఆటో బోల్తా పడి దూదేకుల పెద్ద నాగమ్మ భర్త ఉషనయ్య అనే మహిళ మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయనీ తెలిపారు. పాములపాడు ఎస్సై పి.తిరుపాలు తెలిపిన వివరాల మేరకు నంద్యాల పట్టణంలోని, క్రాంతి నగర్ కు చెందిన దూదేకుల శివరామయ్య కుటుంబం, వారి బంధుమిత్రులు మొత్తం పదిమంది పాములపాడు మండలంలోని, కృష్ణానగర్ గ్రామానికి పెళ్లి సంబంధం నిశ్చితార్థం చేసుకునేందుకు రెండు ఆటోలలో కృష్ణనగర్ గ్రామానికి వస్తున్న క్రమంలో మద్దూరు సమీపంలో కే.సి.కెనాల్ కట్ట వద్ద ఆటో వేగాన్ని డ్రైవర్ వెంకటేష్ కంట్రోల్ చేసుకోలేక అదుపుతప్పి పల్టీలు కొట్టడం జరిగిందన్నారు. ఆటోలో ఉన్న పెద్ద నాగమ్మ మృతిచెందగా అలాగే మౌలాలమ్మ, గోకారమ్మ ,నాగన్న, రాజమ్మ, మరి ఇద్దరు తీవ్ర గాయాల పాయాలయ్యారని తెలిపారు. మృతురాలి బంధువులు ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.తిరుపాలు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

enivasnews.com





