పాములపాడు : ఎల్నీనో ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని మండలాలలో వర్షాలు పడక దేవాలయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవడంతో అక్టోబర్ 7న ఉదయం విజయవాడలోనీ, మాకినేని బసవపునయ్య విజ్ఞాన కేంద్రం నందు జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ ఏపీ కౌలు రైతుల సంఘం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు డి.స్వామన్న, రైతు సంఘం జిల్లా నాయకులు, టి.వెంకటేశ్వరరావు, ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్.షేక్షా అలీ, తదితర ప్రజా సంఘాల నాయకులు కలిసి కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు డి.స్వామన్న, రైతు సంఘం జిల్లా నాయకులు టి.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్.షేక్షాఅలీ, కౌలు రైతు సంఘం నాయకుడు ఆనంద్ గౌడ్, తదితర నాయకులు మాట్లాడుతూ దేవాలయ భూములు సాగుదారుల సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయని, ముందుగానే దేవాలయ వేలంపాటలో ఎకరా 20,000/- నుంచి 35 వేల వరకు వేలం పాట పాడి దక్కించుకోవడం కోవడం జరిగిందని, తీరా సాగుదారులు వర్షాలు పడక దేవాలయ భూములు సాగు చేయక తీవ్రంగా నష్టపోవడం జరిగిందని, దేవాలయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు, ఒక సంవత్సరం గుత్త రద్దుచేసి, తిరిగి వారిని కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు కార్డులు లేకపోయినా వాస్తవ సాగుదారులను గుర్తించి, నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.