నంద్యాల జిల్లా/ఆత్మకూరు : ఆరోగ్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని, తన నియోజకవర్గ ప్రజల సంక్షేమమే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లక్ష్యమని ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి సహకారంతో కర్నూలు శ్రీ.చక్ర హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఇస్లాంపేట ఏరియాలోని, 86 బూత్ లో ఏర్పాటుచేసిన, మెడికల్ క్యాంప్ లో ముఖ్యఅతిథిగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దిన్ హాజరై, ప్రారంభించారు. ఈ క్యాంప్ లో గుండెకి సంబందించిన ఈసీజీ, 2డి ఈకో పరీక్షలు కంటికి సంబందించిన పరీక్షలు ఎముకల వ్యాధి సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. ఈ యొక్క క్యాంప్ లో దాదాపు 200 మంది హాజరయ్యారు. ఆరోగ్యశ్రీ ద్వారా శ్రీ చక్ర హాస్పిటల్ వారు సేవలు అందించడం అభినందించదగ్గ విషయమన్నారు. హాస్పిటల్ చైర్మన్ విజయకుమార్ రెడ్డి నీ అభినందించారు. హాస్పిటల్ గుండె వ్యాధి వైద్యులు ఆంజనేయులు మాట్లాడుతూ బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి గుండె పరీక్షలు చేయించుకోవాలనీ అన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి, సంబంధిత వ్యాధి గ్రస్తులకు ఉచితముగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పప్సిల్ మున్నా, 86వ బూత్ ఇంచార్జ్ పిలి మహబూబ్ బాషా, తైక్వాండో గౌరవ అధ్యక్షులు నాయభ్, సయ్యద్.అసదుల్లా, సాదిక్, పాన్ మహమ్మద్, యువ కిరీటం ముసలిమడుగు మహబూబ్, గుండెవ్యాది నిపుణులు డాక్టర్ ఆంజనేయులు మేనేజర్. రాజేష్, ధర్మేంద్ర, ఈసీజీ టెక్నీషియన్ సురేఖ, భార్గవి కంటి వైద్య నిపుణులు ఫైజుల్ భాష, బావుజీ, ప్రసాద్ పాల్గొన్నారు.
శ్రీశైలం నియోజకవర్గం ప్రజల సంక్షేమమే బుడ్డా రాజన్న లక్ష్యం
సింగిల్ విండో చైర్మన్ ఏ షహబుద్దీన్, స్పోర్ట్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు రేడియం నూర్
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ప్రచురణ తేదీ: 05 October 2026 06:05 PM
enivasnews.com




