ఆత్మకూరు :- అఖిల భారత కాంగ్రెస్ కమిటీ , ఏపీసీసీ అధ్యక్షురాలు వైస్ షర్మిలా రెడ్డి, ఏఐసిసి సభ్యులు & కర్నూలు జిల్లా ఇంచార్జ్ జెంగిటి లక్ష్మినరసింహ యాదవ్, నంద్యాల డిసిసి అధ్యక్షులు మద్దిలేటి స్వామి ఆదేశాల మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ హయాంలో దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారని (ఓట్ చోరీ) నిరసిస్తూ ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌడు సెంటర్ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాపై నిరసనగా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును కాలరాయడం తీవ్రమైన నేరం. దేశంలో కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించి ఓట్ చోరీకి పాల్పడటం రాజ్యాంగ విరుద్ధం. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ దిగిపోయే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో తెలిపారు. ర్యాలీ అనంతరం తహసిల్దార్ కి ఆత్మకూరు, వెలుగోడు, కొత్తపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, ఓటర్ల హక్కులను కాపాడటంలో విఫలమైన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి లేదా ఆయనను తొలగించాలి. బీజేపీ కు మద్దతుగా ఉంటూ ఓట్లు తొలగింపు చర్యలకు పాల్పడిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలన్నారు. 13 కోట్ల ఓట్ల తొలగింపుపై విచారణ: దేశవ్యాప్తంగా అక్రమంగా తొలగించిన 13 కోట్ల ఓట్లకు సంబంధించి సమగ్రమైన, స్వతంత్ర సుప్రీంకోర్టు న్యాయ విచారణ జరిపించాలనీ, ఓటరు ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన అర్హులైన ఓటర్లందరి పేర్లను వెంటనే తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలన్నారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీసే చర్యలను తక్షణమే నిలిపివేయాలనీ, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం మరియు పారదర్శకతను పునరుద్ధరించడానికి ఈవీఎం వినియోగాన్ని తక్షణమే నిషేధించాలనీ అన్నారు. ప్రపంచంలోని ప్రముఖ ప్రజాస్వామ్య దేశాల్లో లాగే భారతదేశంలో కూడా రాబోయే అన్ని ఎన్నికలను మళ్లీ పాత పద్ధతిలోనే బ్యాలెట్ పేపర్ ద్వారానే నిర్వహించాలనీ, ఈసీ ఐఐటి/పోర్టల్స్ నిర్వహణ మరియు ఓటర్ల తొలగింపు ప్రక్రియల విషయంలో మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండా లేదా వారి అభ్యంతరాలను పక్కనపెట్టి ప్రధాన కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని సీడబ్ల్యూసీ సమావేశంలో కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు సాంప్రదాయకంగా ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో, ప్రత్యేకించి పేదలు, మైనారిటీలు, మరియు వెనుకబడిన వర్గాల ఓట్లను ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఓటరు జాబితాల నుండి తొలగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు షేక్.జాకీర్ హుస్సేన్, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు ఎం.పి.మద్దిలేటి, డీసీసీ జనరల్ సెక్రటరీ అహమద్ బాషా, ఆత్మకూరు మండల అధ్యక్షులు బీ.ఆర్.కృష్ణా రెడ్డి, జనరల్ సెక్రటరీ రెహమాన్, పట్టణ అధ్యక్షులు కోవా ఖాదర్, వెలుగోడు మండల అధ్యక్షులు అక్బర్ సాహెబ్, జిల్లా కార్యదర్శి ఇబ్రహీం, కొత్తపల్లి మండల ఉపాధ్యక్షులు నాగన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అహమద్ హుస్సేన్, ఆత్మకూరు పట్టణ అధ్యక్షురాలు ఆశా జ్యోతి, కొత్తపల్లి మండల యూత్ అధ్యక్షులు మోహన్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం తీరుపై ‘ఓట్ చోరీ’ భారీ నిరసన కార్యక్రమం