కల్లూరు :- కల్లూరు మండలంలోని, 28 వ వార్డ్ దూపాడు గ్రామంలో నేడు గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎడ్యుకేషన్ డైరెక్టర్ జి.నాగముని లు పాల్గొని, అర్హులందరికీ ఇంటింటికి వెళ్లి పింఛన్ల నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రెండేళ్ల పాలనలో 1వ తేదీనే పింఛన్ అందజేస్తున్నామని అన్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాలకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం అమలు అవుతుందని అన్నారు. ప్రతి నెలా పింఛన్ సకాలంలో అందడం ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కలుగుతోందనీ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా క్షేత్రస్థాయిలో పనిచేయడం మనందరి బాధ్యత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని