పాములపాడు :- మండల కేంద్రమైన పాములపాడు గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభ సమావేశంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య అభివృద్ధి చేసిన కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందడుగు వేశాయన్నారు. పేదరిక నిర్మూలల కోసం పి4 బంగారు కుటుంబాలులో భాగంగా మన వేంపెంట గ్రామానికి చెందిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు బానకచర్ల గ్రామంలో వృద్ధ దంపతులకు లక్షలు ఖర్చుపెట్టి ఇండ్లు నిర్మించి ఇవ్వడం గొప్ప గర్వకారణమన్నారు. పేదలు ధనవంతులు కావడానికి ఈ పిఫోర్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజల అవసరాలను తెలుసుకుంటూ, గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ గ్రామసభలో పాల్గొన్నారు. పాములపాడు గ్రామపంచాయతీలో కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనుల గురించి, వాటికి ఖర్చుపెట్టిన నిధుల గురించి వివరించడం జరిగింది. నందికొట్కూరు నియోజకవర్గంలోని, పాములపాడు మండల పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారులకు నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య పంపిణీ చేయడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సాయం ఎంతో తోడ్పాటునందిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, వేంపెంట సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడు, తదితర నాయకులతో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా బానకచర్ల గ్రామ సంకటి రత్నమయ్య-30,000/-రూపాయల, ఇస్కాల గ్రామానికి చెందిన కురువ చంద్రకళ–41,112/- రూపాయల, మొల్ల భాష (మరణానంతరం)మొల్ల మైమున్ –45,834/-రూపాయల, వేంపెంట గ్రామానికి చెందిన పింజరి కాశమ్మ- 42,595/- రూపాయల, సిండే రంగరాజు నరేంద్ర కు 42,276/- రూపాయల, ఎర్రగూడూరు గ్రామ జి.రుషికేశ్ కు– 8,43,920/-రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాజు, తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, ఎస్సై పి.తిరుపాలు, విబిజి రాంజీ ఏపీఓ బి.జయంతి, ఎంపీడీవో కార్యాలయ సూపర్డెంట్ తిరుపాలు, పిఓపిఓఆర్డి సులోచన, రెవెన్యూ ఇన్ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, గ్రంథాలయ అధికారి సి.వి. కృష్ణారెడ్డి, అగ్రికల్చర్ ఏవో ఎం.వెంకట మహేశ్వర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ- ఎస్.సువర్చల, ఐసిడిఎస్ సూపర్వైజర్ పి.లలిత ప్రభావతమ్మ, పిఆర్ జెఈ- రాఘవేంద్రప్రసాద్, కరెంటు ఏఈ రఫీ, కానిస్టేబుల్ షేక్షాఅలి, పంచాయతీ కార్యదర్శి క్రాంతికుమార్, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, మండల నాయకులు చెల్లె.హరినాథ్ రెడ్డి, శివ శంకర్ స్వామి, డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు, ఇస్కాల ఏర్వ.నాగలక్ష్మి రెడ్డి, లింగస్వామి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ రవీంద్ర, సోషల్ మీడియా ప్రతినిధి ప్రవీణ్, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామసభలో కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందడుగు..! ఎమ్మెల్యే గిత్త.జయసూర్య
బానకచర్ల గ్రామ వృద్ధ దంపతులకు పి4 లో ఇంటిని నిర్మించి ఇచ్చిన సింగపూర్ డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావుకు ప్రత్యేక అభినందనలు
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ప్రచురణ తేదీ: 01 October 2026 10:30 PM
enivasnews.com




