పాములపాడు :- నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఆదేశాల మేరకు ఆత్మకూరు డి.ఎస్.పి ఆర్.రామాంజి నాయక్ ఉత్తర్వుల మేరకు మరియు రూరల్ సీఐ ఎం.సురేష్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో శక్తీ టీం సిబ్బంది పాములపాడు ఏఎస్ఐ షేక్.నూర్ అహమ్మద్, ఆత్మకూరు ఉమెన్ హోమ్ గార్డ్ సుప్రియ ల మరియు పాములపాడు మండలంలోని, లింగాల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ మాదన్న ల ఆధ్వర్యంలో సుమారు 240 మంది పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు శక్తి యాప్ గురించి, అత్యవసర పరిస్థితిలో పోలీసుల రక్షణ పొందడానికి చేయవలసిన ఫోన్ నెంబర్ల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఐ షేక్.నూర్ అహమ్మద్ మాట్లాడుతూ శక్తీ యాప్ అవేర్నెస్ " ప్రోగ్రాము లో భాగంగా మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన " శక్తి యాప్ " గురించి మరియు శక్తి యాప్ వాట్సాప్ నంబర్ 7993485111 గురించి తెలుపుతూ, మహిళల రక్షణకై ఏర్పాటు చేసిన పోక్సో చట్టం గురించి, బాల్యవివాహాలు, చిన్న పిల్లలపై నేరాలు జరగకుండా ఆపుటకు 1098 ఫిర్యాదు ఫోన్ చేయవలెనని తెలిపారు. 18 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయకూడదని అట్లా ఎవరయినా చేస్తునట్లయితే 112 కు గానీ, 1098 కి ఫోన్ చేసి చెప్పాలని తెలుపుతూ, ఉమన్ వెల్ఫేర్ 181, ఎమర్జెన్సీ కాల్ 112, 100 కి ఫోన్ చేయవలెనని, సైబర్ క్రైమ్ జరిగినచో టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేయవలెనని, ఫేక్ కాల్స్, ఏపీకే ఫైల్స్ లాంటివి ఏదన్నా మీ పేరెంట్స్ సెల్ ఫోన్ వాట్సప్ లకు ఎవరైనా లింక్ మెసేజ్లు పంపితే వాటిని ఓపెన్ చేయొద్దని తెలుపుతూ వాటి ద్వారా వారికీ జరిగే ఆర్థిక నష్టాలను గురించి కూడా తెలిపి, వన్ స్టాప్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. మీరు, మీ ఇండ్లకు పోయిన తర్వాత మీ పేరెంట్స్ యొక్క ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లలలో శక్తీ యాప్ డౌన్ లోడ్ చేసుకొని, అత్యవసర సమయాలలో శక్తీ యాప్ ను ఎలా వాడాలి, దానీ ఉపయోగాల గురించి తెలపడం జరిగింది. అంతే కాకుండా మీరు మంచి క్రమశిక్షణతో మెలుగుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ ఆడపిల్లలను" ఈవిటీజింగ్ " పేరుతో ఎవరైనా ఆకతాయిలు అల్లరి పట్టించడం లాంటివి చేస్తే, ఏ మాత్రం అధైర్య పడకుండా మీకు రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తీ యాప్ ను ఉపయోగించి 112 కు గానీ, 1098 కి గానీ ఫోన్ చేసి సహాయం పొందవచ్చునని అవగాహన కల్పించారు. అదేవిధంగా 18 సంవత్సరాలలోపు, వయస్సు ఉన్న మైనర్(బాల, బాలికలు) విద్యార్థులు ఎవరు కూడా మోటార్ సైకిల్ (బైక్)ను నడపకూడదని తెలియపరిచినాము. చదువు మీద ధ్యాస పెట్టి బాగా కష్టపడి చదివి మీ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని, చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో గౌరవాన్ని, మర్యాదను, హుందాతనాన్ని తీసుకొచ్చి మీ తలరాతలను మార్చేది చదువు ఒక్కటే అని తెలుపుతూ అదేవిధంగా మీ ఇంట్లోని, మీ పేరెంట్స్ మోటార్ సైకిళ్లను నడిపేటప్పుడు ఖచ్చితంగా తలకు రక్షణగా " హెల్మెట్ " పెట్టుకొని ప్రయాణం చేయాలని హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఎవ్వరూ కూడా మీ ఇంట్లోని వారు నాన్న, అన్నా, తమ్ముడు బాబాయి, మేనమామ లు లేక మీ కాలనీవాసులకు ఎవ్వరైనా సరే మధ్యం త్రాగి వాహనాలను నడపవద్దని అందరికీ ఈ సమాచారం తెలియజేయాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా త్రాగి వాహనాలు నడిపితే కోర్టు వారు 10 వేల రూపాయలు (ఫైన్) జరిమానా లేదా జైలు శిక్షను విధిస్తారని తెలుపుతూ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు షేక్.హుస్సేన్, తదితర ఉపాధ్యాయులు, సోషల్ వర్కర్ నవీన్ కుమార్ గౌడ్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది.

enivasnews.com





