ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈ రోజు ఆత్మకూరు పట్టణంలోనీ, రైతు భరోసా కేంద్రంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ హేమలత ఆధ్వర్యంలో నిర్వహించిన "రైతన్న - మీ కోసం" కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్- ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పంచ సూత్రాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాటం.రామిరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు టపాల అశ్రఫ్ అలీ, ఏవో లు లలితమ్మ, రాజశేఖర్, ఎంపీఈవో లు బి.వాజిద్, కిషోర్, రైతూ నాయకులు మహబూబ్ బాషా, మాలిక్, ఆవుల రసూల్, శ్రీను, మండలంలోని రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News