Friday, 31 July 2026 08:11:34 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

విశాఖపట్నంలో డిసెంబర్-31 నుండి జనవరి-4 వరకు జరిగే 18వ సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయండి

Date : 26 December 2025 10:27 PM Views : 208

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు, ఉద్యోగులకు, ప్రజలకు వ్యతిరేకంగా చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం చేసుకునేందుకు విశాఖపట్నంలో డిసెంబర్-31 నుండి జనవరి- 4వ తేది వరకు జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలలో చర్చించి భవిష్యత్ కార్యాచరణకు కార్మికులను ఉద్యోగులను ఐక్యం చేయడం జరుగుతుందని సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి రామ్ నాయక్, నాయకులు గోపాలకృష్ణ, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి- డి.స్వామన్న, సీఐటీయు మండల కార్యదర్శి- ఎం.రాజు లు అన్నారు. పాములపాడు మండల కేంద్రంలో మహాసభలు జయప్రదం చేయాలని ప్రచార జాత నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో కార్మికులను నయా బానిసలుగా చేసే విధానాలను అమలు చేస్తుందని ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా కుదింపు చేసి కార్మికులను నయా బానిసలుగా పెట్టుబడిదారులకు కార్పాటి సంస్థలకు అనుకూలమైన విధానాలను చేస్తుందని అదేవిధంగా ప్రపంచ దేశాల సైతం ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేస్తుంటే మన దేశంలో 13 గంటల పాటు పని విధానాన్ని అమలు చేయాలని ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు నోటి పై చేయడాన్ని రాష్ట్రాలు అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, రైల్వే, రక్షణ ,ఎల్ఐసి, పోస్టల్, బ్యాంకు లాంటి సంస్థలను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పి జెప్పి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని వీటివలన ప్రజలకు అనేక ఇబ్బందులు రాబోయే కాలంలో ఎదురవుతాయని, వీటి పైన గత మూడు సంవత్సరాల కాలంలో సిఐటియుగా చేసిన పోరాటాలను సమీక్షించుకుని రాబోయే కాలంలో మరో మూడు సంవత్సరాలకు అనుగుణంగా బిజెపి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు చేసే దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా కార్మికులను ఉద్యోగులను ప్రజలను చైతన్యపరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా పోరాటాలను ఉదృతం చేస్తామని అన్నారు. నాలుగవ తేదీ మహాసభల అనంతరం విశాఖపట్నంలో లక్షలాది మంది కార్మికులు ఉద్యోగులతో భారీ బహిరంగ సభ జరిపి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించేలా కదం తొక్కుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు టి.వెంకటేశ్వరరావు, రంగస్వామి, మహమ్మద్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :