Thursday, 30 July 2026 11:46:12 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు

నాగమధు యాదవ్ ( ఎన్ ఎస్ యు ఐ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు), ఏపీసీసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు

Date : 30 December 2025 10:07 AM Views : 428

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగ మధు యాదవ్, ఏపీసిసి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అక్రమ పద్ధతులతో, దొంగ ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. నంద్యాల జిల్లా, ఆత్మకూరులోని, స్టేట్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు & యూత్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ నాగ మధు యాదవ్, ఏపీసిసి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు లు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగ మధు యాదవ్, ఏపీసిసి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు లు మండిపడ్డారు. వెంటనే ఈ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద ప్రజల పొట్టకొట్టేలా బీజేపీ నిర్ణయాలు ఉంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా, దొంగ ఓట్లను అడ్డం పెట్టుకుని బీజేపీ అధికారంలోకి వచ్చిందని నాగ మధు యాదవ్ విమర్శించారు. నేడు దేశం ఇంతలా అభివృద్ధి చెందిందన్నా, ప్రపంచ దేశాల ముందు భారత్ తలెత్తుకు నిలబడిందన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పాత్రను, దేశానికి దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గరీబీ హటావో నినాదంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన అందించిన సేవలను ఆయన కొనియాడారు. ఇందిరాగాంధీ తెచ్చిన స్వాతంత్ర్యం వల్లే నేడు అందరూ స్వేచ్ఛగా ఉన్నారని, అటువంటి నాయకుల కష్టాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే దేశ ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్తారని పాండిచ్చేరి ఇంచార్జి నాగ మధు యాదవ్, ఏపీసిసి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు లు హెచ్చరించారు. అనంతరం వీళ్ళ సమక్షంలో కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కొత్తగా పార్టీలో చేరిన వారందరికీ మెడలో కాంగ్రెస్ పార్టీ కండువవేసి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా నాయకులు, శ్రీశైలం నియోజకవర్గం నాయకులు, నందికొట్కూరు నియోజవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం, తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :