Friday, 31 July 2026 11:24:28 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుపై పిఆర్టియు ఆధ్వర్యంలో విజయోత్సవాలు

సీఎం చంద్రబాబు నాయుడు కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు

Date : 13 July 2026 10:20 PM Views : 100

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : డీఎస్సీ–2003 ఉద్యోగులు,ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం (ఓ పి ఎస్) వర్తింపజేస్తూ ఆర్థిక శాఖ జి.ఓ. ఎంఎస్. నెం.53, తేదీ: 13-07-2026 జారీ చేయడం పట్ల పీఆర్టీయూ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో నేడు ఆత్మకూరు పట్టణంలోని, ఎన్టీఆర్ సర్కిల్ (గౌడ్ సెంటర్)లో ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు. డీఎస్సీ–2003 ఉపాధ్యాయులతో పాటు పీఆర్టీయూ నాయకులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, ఈ నిర్ణయానికి సహకరించిన మంత్రివర్గ సభ్యులకు మరియు అధికారులకు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో–57 అమలు నేపథ్యంలో డీఎస్సీ–2003తో పాటు సుమారు 11 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన పెన్షన్ విధానం (ఎన్ పి ఎస్) స్థానంలో పాత పెన్షన్ విధానం (సిపిఎస్) వర్తింపజేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. అలాగే, డీఎస్సీ–2003 ఉద్యోగులకు పాత పెన్షన్ సాధనలో విశేష కృషి చేసిన పీఆర్టీయూ లెజెండ్ ఎమ్మెల్సీ డా. గాదె శ్రీనివాసులు నాయుడు కి, పీఆర్టీయూ రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, ప్రాజెక్టు చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం భాషా, శివప్రసాద్ రెడ్డి, టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పీ.నాగూర్ ఖాన్, కమతం శంకర్, శివారెడ్డి, చెల్లె హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు సయది ఇబ్రహీం, పీ.నూర్ మొహమ్మద్, కె.హుస్సేన్ సాహెబ్, దామరకుల రవి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు చంద్రశేఖర్, ఆత్మకూరు మండల అధ్యక్షుడు ప్రదీప్, ప్రధాన కార్యదర్శి జి.హనుమంతు, కొత్తపల్లి మండల అధ్యక్షుడు సయ్యద్ కలీముల్లా, వెలుగోడు మండల అధ్యక్షుడు సయ్యద్ మెనుద్దీన్, పాములపాడు మండల అధ్యక్షుడు ఏ. సాంబశివుడు, జిల్లా నాయకులు గౌస్, సమద్, రఫీక్, ఖాజా, శోభన్ బాబు, ఆంజనేయులు, పుష్పలత, రంజిత్, తరుణ్, కరీం బాషాతో పాటు పెద్ద సంఖ్యలో డీఎస్సీ–2003 ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: