Friday, 31 July 2026 10:36:42 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

జంతర్ మంతర్ రక్తపాతం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు - దేశ ప్రధానిగా మోడీ యువతకు ఇచ్చే సందేశం ఇదేనా?

టి. షాజహాన్ బేగం (కాంగ్రెస్ పార్టీ)

Date : 23 July 2026 06:54 PM Views : 65

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ బేగం మాట్లాడుతూ వెంటనే ఢిల్లీ ఘటనపై క్షమాపణ చెప్పి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుండి రాజీనామా చేయాలనీ, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అఖిలభారత మహిళా కాంగ్రెస్ డిమాండ్ తప్పు ఎంతటి వారైనా శిక్షించాలన్నారు. ప్రవేశ పరీక్ష పేపర్ల లీక్ పై ప్రశ్నిస్తే దేశ భవిష్యత్తుకు పునాది అయిన యువతపై లాఠీచార్జీలు చేయడం చాలా దుర్మార్గమని అన్నారు. ఆ దెబ్బలు నరేంద్ర మోడీ మీకు తగిలి ఉంటే ఆ బాధ తెలిసేది మీ పిల్లలు పరీక్షలు రాసి ఉంటే ఆ బాధ తెలిసేదన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షలు రద్దయి ఆవేదనతో చనిపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. విద్యార్థులపై జరిగిన దాడికి బిజెపి ప్రభుత్వం ముఖ్య కారణం అని దేశంలో రైతుల ఆత్మహత్యలకు, నేడు విద్యార్థుల చావులకు కారణమైందన్నారు. చివరికి ప్రపంచాన్ని నాశనం చేస్తుందనీ, ఆర్థికంగా దేశానికి పాతాళానికి పడేసింది. ఎఫ్ స్టీన్ ఫైల్స్ తో అమాయక చిన్న పిల్లల జీవితాలను నాశనం చేస్తుందనీ అన్నారు. ముఖ్యంగా దేశంలో మహిళలకు రక్షణ లేదు దొంగ ఓట్లతో గెలిచిందే కాక కులం పేరుతో మతం పేరుతో రాజకీయం చేస్తూ నీట్ విద్యార్థులకు, భారతదేశ ప్రజల హక్కులకు పోరాటం చేసే ఏకైక ప్రతిపక్ష నాయకుడు మన రాహుల్ గాంధీ ని అరెస్టు చేయడం, మహిళా ఎం.పి- ప్రియాంక గాంధీ ని అవమానపరంగా వ్యవహరించారు. అది కూడా మహిళా పోలీసులు లేకుండా అనేది మోడీ గారి ప్రభుత్వం పిరికి ప్రభుత్వమని మరొక్కసారి రుజువు అయిందన్నారు. ముఖ్యంగా ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం నిరసనను అణచివేయడానికి పోలీసు బలాన్ని ఉపయోగిస్తుంది. ఇదే మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు, ఈ దౌర్జన్యకాండ నిదర్శనం అని అన్నారు. గుర్తుంచుకోండి. ప్రశ్నించే గొంతులను అరెస్టు చేయొచ్చు కానీ, ప్రజల ఆగ్రహాన్ని కాదు యువత తిరుగుబాటును లాఠీలతో ఆపలేరనీ, ప్రజాస్వామ్యాన్ని సంకెళ్లతో బంధించలేరనీ భారతదేశంలో ఉన్న యువత విద్యార్థులు భారత దేశ పేద ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. మీ యొక్క పాలనను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నాం నీచ రాజకీయం చేస్తూ దేశానికి చేస్తున్నటువంటి నష్టాన్ని ప్రతి భారతీయ పౌరులు గమనిస్తున్నారనీ అన్నారు. మహిళలపై చేసే అరాచకాల్ని, మీరు దోచుకొనే హక్కులని దేశ మహిళలకు ఇచ్చే గౌరవాన్ని 33 శాతం రిజర్వేషన్ బిల్లును డిలిమిటేషన్ కూ లింకు చేయడం మహిళలు గమనిస్తున్నారనీ అన్నారు. దేశ ప్రజలకు బాగా అర్థమైందనీ, ఇలాంటి నైతిక విలువలు లేని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ఒక్కరి కోసం కాదు దేశం బాగుకోసం నిరుద్యోగ యువత కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం తన గలాన్ని విప్పి ప్రశ్నించే నిలువెత్తు రూపం మన రాహుల్ గాంధీ అని అలాంటి నాయకున్నీ అరెస్టు చేయడం అనేది ఏమాత్రం సరికాదనీ, ఇది అతనితో బాధాకరమైన విషయం అని దీనికి మేము అఖిలభారత మహిళా కాంగ్రెస్ తరపున ఖండిస్తున్నామన్నారు. ఆరోజు దేశ మహిళా కాంగ్రెస్ అంతా మేము ఢిల్లీలోనే ఉన్నామన్నారు. ఈ మహిళా హక్కుల గురించి, 33% రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని ఈరోజే చేయాలనీ ఇప్పుడే చేయాలన్నారు. మహిళలకు రావలసిన హక్కుల గురించి ప్రశ్నిస్తే మహిళాశక్తి అంటే ఏంటో వణుకు పుట్టి భయపడి జంతర్- మంతర్ వద్దకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపేశారన్నారు. విద్యార్థులు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రశ్నిస్తే పోలీసులతో రౌడీయిజంగా విద్యార్థులపై లాఠిచార్జి చేయించి, రాహుల్ గాంధీ ని అరెస్టు చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కుటుంబం రాహుల్ గాంధీ జిది అని మీరు చేసే డ్రామాలకు భయపడరు అని మరొక్కసారి గుర్తు చేస్తున్నామన్నారు. ఇదంతా దేశ ప్రజలు బాగా గమనించాలని, కుల మతాలకతీతంగా, రాజకీయాలకతీతంగా ప్రజలంతా ఒక్కటై నీచ రాజకీయం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని, కేంద్రమంత్రిని మన దేశం నుండి తరిమికొట్టి దేశ గౌరవాన్ని, దేశాన్ని, నైతిక విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నందికొట్కూరు నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం, మహిళ కార్యకర్తలతో కలిసి జై కాంగ్రెస్ - జై జై రాహుల్ గాంధీజీ అని నినాదాలు చేశారు..

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :