ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : కొత్తపల్లి మండలంలోని, దుద్యాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య కూటమి నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి, లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ పింఛన్లను అందజేశారు అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా దుద్యాల గ్రామానికి చెందిన గౌరు.రత్నమ్మ కి, రూ.71922/-, పేరుమాల జానయ్య కి రూ.35000/- మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, కొత్తపల్లి మండలం కన్వీనర్ లింగస్వామి గౌడ్, మల్లారెడ్డి, రఫీ, క్లస్టర్ ఇంచార్జ్ నారపరెడ్డి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఎ- రవీంద్ర, నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News