ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ & ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ & న్యాయవాది జి.నాగముని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టిటిడి వారు ప్రతిరోజు వచ్చే వేల భక్తులకు కల్పిస్తున్న ఉచిత అన్య ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు, నిత్య అన్నదాన కార్యక్రమాలు, అన్ని రకాల వసతులు, లడ్డూల పంపిణీ కార్యక్రమాలు బాగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. భక్తులు కూడా తమ మొక్కులను తీర్చుకోవడం గొప్ప సంగతి అన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో, మరియు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మతాల ప్రజలు, రైతులు, కూలీలు, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, కలిసి వెలిసి ఆనందంగా జీవించాలని అందులో మా కుటుంబం ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు లు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మంచిగా అమలవుతున్నాయని, భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పథకాలు రూపొందించాలని కోరుకోవడం జరిగింది.
Admin
E Nivas News