Thursday, 30 July 2026 09:15:55 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

కొత్తపల్లి మండలంలోని ఎదురుపాడు గ్రామ "ప్రభుత్వ ఎంపీపీ స్కూల్ కు దారి చూపెట్టండి మహాప్రభు" అని విద్యార్థులతో కలిసి, వేడుకుంటున్న సమతా సైనిక్ దళ్ జిల్ల

Date : 10 November 2025 06:54 PM Views : 448

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని, వెదురుపాడు గ్రామంలో ఉన్న "ప్రభుత్వ ఎంపిపి స్కూలుకు రాస్తా చూపించండి మహా ప్రభు" అని విద్యార్థులతో కలిసి సమతా స్థానిక దళ్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు సగినాల సురేష్, మండల అధ్యక్షుడు నేరేడు పుల్లయ్య, తదితర నాయకులు ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్కడ మూడు అడుగుల రోడ్డులో స్కూలుకు పిల్లలు ఎలా పోతారని సమతా సైనిక్ దల్ సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు సగినాల.సురేష్, కొత్తపల్లి మండలం అధ్యక్షుడు నేరేడు.పుల్లయ్య పగిడిమాన్.రవి, పగిడిమాన్ బాలేసు, నేరేడు.బాబు నేరేడు.వీరన్న లు ఖండించారు. గత ఐదారు సంవత్సరాలగా ఈ స్కూలుకు రాస్తా లేదని విషయంపై ప్రజా సంఘాలు స్పందించి మండల అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా, అధికారుల వైఖరి నిర్లక్ష్యంతో ఉందని పాఠశాలకు ఇంతవరకు రస్తా చూప లేదన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఎదురుపాడు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దారి ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు త్వరగా రస్తా ఏర్పాటు చేయకపోతే సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో, అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృత చేస్తామని సగినాల.సురేష్ నేరేడు.పుల్లయ్య లు అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :