Thursday, 30 July 2026 08:10:09 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

నందికొట్కూరులో శ్రీశైలం ముంపు భాదితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని 119 వ రోజులుగా రిలే నిరాహార దీక్షలు

Date : 22 July 2026 10:40 PM Views : 74

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : 119 రోజులు (నాలుగు మాసాలు)గా తాము కోల్పోయిన యావదాస్తికి పరిహారంగా ప్రభుత్వం తమకు కల్పించాల్సిన ఉద్యోగ జీవో 98 హామి అమలుకోసం నందికొట్కూరు పట్టణంలో శ్రీశైలం ముంపు భాదితులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలను సిపిఐఎంఎల్ రాష్ట్ర అధ్యక్షులు ముగత బంగార్రావు, ఏఐసిసిటియు రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ కిరణ్, ఉమ్మడి జిల్లా సిపిఐఎంఎల్ కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు దీక్షా శిభిరం ను సందర్శించి మద్దతుగా సంఘీభావం తెలిపారు. బంగార్రావు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం తమ యావదాస్థిని దారాదత్తము చేసిన ముంపు భాదితులను ఆదుకోవడంలో ప్రభుత్వము విఫలమైందని స్థానిక నేతలు కనీసపరామర్శకు కూడా రాలేదంటే ముంపు భాదితుల పట్ల వారికున్న నిర్లక్ష్యము కొట్టొచ్చినట్లు కనబడుతుందని ఆయన అన్నారు. ఎలాంటి ఆర్ధిక భారం పడని పోస్టుల ఖాళీల భర్తికి కలెక్టర్ ప్రపోజల్ పంపిన పైస్థాయిలో ప్రభుత్వము పరిస్కంంచకపోవడం మొండివైఖరి సూచిస్తున్నదని ఆయన అన్నారు. ముంపు భాదితుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, పవన్ కల్యాణ్ ల దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోని, ముగ్గురు ముఖ్య నాయకులు హామీ ఇచ్చి గద్దెనెక్కాక ముంపు భాదితులను పట్టించుకోకపోవడం దారుణమని, 32 మంది ఆత్మహత్యలు చేసుకొని పిట్టల్లా రాలిపోతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని కాలే కడుపులతో 119 రోజులుగా దీక్షలు చేస్తున్న ముంపు భాదితుల సమస్య పరిస్కరించకపోవడం సిగ్గుచేటని, సమస్య పరిస్కారమయ్యే వరకు సిపిఐఎంఎల్ పార్టీ భాదితుల తరపున పోరాడుతామని ఆయన హెచ్చరించారు. ఈ దీక్షకు మద్దతుగా సిపిఐఎంఎల్ లిభరేషన్ పార్టి రాష్ట్ర అధ్యక్షుడు ముగుత బంగార్రావు, ఏఐసిసిటియు రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ కిరణ్, సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు మరికొందరు మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముంపు భాదితులు నాగేంద్రుడు, జమ్మన్న వెంకటేశ్వర్లు, సుబ్బయ్య వెంకటేష్, నాగరాజు, నాగసుంకన్న, మౌలాలి, శాలమ్మ, రాణెమ్మ, శ్యామలమ్మ, రాజేశ్వరి, జయన్న తదితర భాదితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :