Friday, 31 July 2026 05:33:15 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి

Date : 29 July 2026 09:11 PM Views : 21

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం భారీ వర్షాలతో నాలాల ప్రవహించే నీరు రోడ్డుపై రావడంతో ఆ ప్రాంతాలను పెద్దపల్లి డిసిపి బి రామ్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్, మేయర్ మహంకాళి స్వామి, గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తో మల్కాపూర్, మెడికల్ కళాశాల, 5 ఇంక్లైన్, తదితర ప్రాంతలలో కలిసి వరదను పరిశీలించారు. జిల్లాలో భారీ వర్షాలతో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని, అదేవిదంగాఅధికారులకు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తుందున వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉందని, వాటి వద్దకి ఎవరు వెళ్లవద్దన్నారు. గోదావరి, మానేరు నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, యువత వెళ్లకూడదన్నారు. వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు. పిల్లలు, యువకులు చెరువులు నది దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలంచడానికి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎటువంటి సహాయం కావాలన్నా డయల్ 100 కి లేదా స్థానిక పోలీస్ అధికారులకి ఫోన్ చేయాలని డీసీపీ సూచించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :