ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని, మల్హర్ మండలాల మధ్య మానేరు నది పై హై లెవెల్ వంతెన నిర్మాణానికి, ఆప్రోచ్ రోడ్డుకు రూ.203 కోట్ల నిధులు మంజూరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం వెంకటాపూర్, మల్లారం, అరెంద గ్రామాల ప్రజలు ఐటీ, పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్ లు మాట్లాడుతూ మంథని నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలుపుతారన్నారు. మంథని మండలములోని ఆరెంద మీదుగా దామెరకుంట వరకు 1.120 మీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పుతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి, ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ నుండి బ్రిడ్జి వరకు అటు సైడు దామేరకుంట రోడ్డు వరకు 9.530 మీటర్ల అప్రోచ్ రోడ్డుకు 203 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బి శాఖ నుండి మంజూరు చేయడం జరిగిందన్నారు. శ్రీధర్ బాబు మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వంతెనలు, రహదారుల నిర్మాణాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల నూతన సర్పంచులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News