ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాద్ శివారులోనిమొయినాబాద్ కేతిరెడ్డిపల్లి గ్రామంలో స్వప్న (34) యువ న్యాయవాది బుధవారం దారుణ హత్యకు గురైంది. దుండగులు ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యను నిరసిస్తూ చేవెళ్ల కోర్టును న్యాయవాదులు బహిష్కరించారు. న్యాయవాదుల కు భద్రత కరువైందని రాష్ట్రవ్యాప్తంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
Admin
E Nivas News