Thursday, 30 July 2026 08:22:42 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

బిసి రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బిజెపి పైన పోరాటమే

అక్టోబర్ 18 న మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నిరసన, ధర్నా కార్యక్రమాలకు సీపీఎం పిలుపు

Date : 15 October 2025 07:59 PM Views : 269

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కాకుండా అడ్డుకుంటున్న బిజెపి మోడీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని, అక్టోబర్ 18 న బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర బంద్ సందర్భంగా బిజెపి,మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా పోరాటం కొనసాగాలని సిపిఎం పిలుపునిస్తుందన్నారు . సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ కు, రాష్ట్రపతికి కేంద్ర,మోడీ ప్రభుత్వానికి పంపించి ,6 నెలలు గడిచిపోయిన నేటికీ బీసీ రిజర్వేషన్ల కు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని సిపిఎం ప్రశ్నిస్తుందన్నారు. బిల్లులను తమ దగ్గరలో ఉంచుకొని నీచ రాజకీయాలు చేయడం రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న రాష్ట్రపతి, గవర్నర్ సరైనదేనా...? బిజెపి, మోడీ ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తే విధంగా వీరి వైఖరి ఉన్నది. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి చట్టబద్ధత కల్పించడానికి అవకాశాలున్న బిజెపి మోడీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయడం కోసమే చూస్తున్నదితాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక తీరు ఇతర రాష్ట్రాల్లో మరో తీరుగా వ్యవహరిస్తున్నదన్నారు . బిజెపి నీచ రాజకీయాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఇంకా సామాజికంగా వెనుకబాటుతనంలోకి నెట్టబడుతున్నారు.బిజెపి కి తగిన గుణపాఠం చెప్పే విధంగా కేంద్ర వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసిన అవసరం ఉందన్నారు. అక్టోబర్ 18 న బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.కేంద్రం పైన పోరాటం చేయడం కోసం రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిన పార్టీలను, సంఘాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం పైన పోరాటాలకు ముందు పీఠాన ఉండాలని, బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో బోడంకి చందు మండల కార్యదర్శి,కమిటీ సభ్యులు సిడం సమ్మక్క,బోగే నాగజ్యోతి,బండారి శ్రీనివాస్,బండారి రాజేశ్వరి, భోగే సత్యం,కొండపర్తి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: