Friday, 31 July 2026 09:53:33 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఘనంగా ప్రారంభమైన శ్రీ దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాలు

Date : 26 November 2025 04:16 PM Views : 317

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవములు ఘనంగా ప్రారంభమైనాయి. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆలయంలో జరిగే దైవ కార్యక్రమాల్లో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. షష్టి తిథి నుండి పౌర్ణమితి వరకు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు హోమగుండం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. దూర్వాస మహర్షి అంబరీసున కు ఇచ్చిన శాపములను విష్ణుమూర్తి గ్రహించి అనేక అవతారంలో స్వీకరించారు. వాటిలో శ్రీ దత్తాత్రేయ అవతారం ఒకటి. ముఖ్యంగా ఈ అవతార ఉద్దేశము ప్రజలు సులభంగా మోక్షము పొందుటకు యోగాభ్యాసమును అభివృద్ధి పరచుట కొరకై అవతరించిన అవతారమే శ్రీ దత్తాత్రేయ అవతారం. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మదినం. శ్రీ దత్తాత్రేయ అవతారము శాశ్వతముగా నిలిచే అవతారము. ఆ క్రమంలో పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభునిగా, కరంజాలో శ్రీ నరసింహ సరస్వతిగా, షిరిడి లో శ్రీ సాయినాథునిగా అవతరించి జనులకు సుఖసంపదలను ప్రసాదిస్తున్నారు. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు 9 రోజులపాటు ప్రత్యేకంగా భజన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అన్ని వాడల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తొమ్మిది రోజులపాటు ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామంలోని పురవీధుల గుండా శ్రీ దత్తాత్రేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. నవరాత్రి ఉత్సవములు అనంతరం అష్టమి తిథి రోజు శ్రీ అనగా దేవి వ్రత కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ పూజారి కొల్లారపు వెంకట రాజం తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: