Thursday, 30 July 2026 10:28:38 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పాత్రికేయులు కడారి బాలేశం నియామకం..

Date : 20 March 2026 07:13 PM Views : 134

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జర్నలిస్టుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు కడారి బాలేశంని నియమించి నట్లుగా సంఘం జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి ప్రకటించారు. గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో జర్నలిస్టుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని అధి కారికంగా ప్రారంభించారు. 30 యేండ్లుగా జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో కొనసాగు తున్న కడారి బాలేశం సేవ లు జర్నలిస్టుల హక్కుల కోసం ఉపయోగపడతా యనే ఉద్దేశ్యంతో బాలేశంకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష బాధ్యతలను అప్పగిచ్చినట్లు జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి శుక్రవారంతెలిపారు. సీనియర్ జర్నలిస్టు కడారి బాలేశం జర్నలిస్టుల సంక్షేమ సంఘంలోకి రావడం ఆనందించాల్సిన పరిణామమని, జర్నలిజం లో ఆయనకు ఉన్న అను భవం సంఘ బలోపేతానికి ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్‌లో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం బాలేశం వంటి సీనియర్ల సేవలు వినియోగించుకుని బలమైన కార్యాచరణతో ముందుకు నడిచి తెలంగాణ జర్నలిస్టుల పక్షాన గట్టిగా కొట్లాడతామని మానసాని కృష్ణారెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టు హక్కుల సాధన కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులను తమతోకలిసిపనిచేయడా నికి రావాలని, వారిక సంఘంలో తగిన ప్రాతినిధ్య ఇస్తామని ఈ సందర్భంగా కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా తన మీద నమ్మకంతో నియమించినందుకు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చీకట్ల శ్రీనివాస్,జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి కి ఈ సందర్భంగా కడారి బాలేశం ధన్యవాదాలు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని డివిజన్ల కమిటీలను త్వరలోనే పూర్తి చేసి భారీ సభను నిర్వహించి జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని కడారి బాలేశం తెలిపారు. రానున్న రోజుల్లో సంఘ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేసి రాష్ట్రంలోనే బలమైన గుర్తింపు జర్నలిస్టుల సంఘంగా ఏర్పడటానికి జాతీయ, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తానని బాలేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చీకట్ల శ్రీనివాస్, జూబ్లిహిల్స్ డివిజన్ సంఘ బాధ్యులు శాసనాల సురేశ్, సీనియర్ పాత్రికే యులు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. మార్చి నెలాఖరులో కరీంనగర్‌లో ఉత్తర తెలంగాణ సభ... మార్చినెలాఖరులో ఉత్తర తెలంగాణ జర్నలిస్టుల సభను కరీంనగర్ పట్టణంలో నిర్వహించ డానికి నిర్ణయించినట్లుగా జర్నలిస్టుల సంక్షేమ సంఘం బాధ్యులు తెలిపారు. ఈ సభ ద్వారా భారీ సంఖ్యలో జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో సభ్యత్వాల నమోదు చేయడానికి ప్రణాళికను రూపొందించినట్లుగా వారు తెలిపారు. ఇప్పటికే జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో సీనియర్ పాత్రికేయులు, వివిధ జర్నలిస్టుల సంఘాల నాయకులు భారీ సంఖ్యలో చేరడానిక ఆసక్తిచూపుతున్నారని వారు తెలిపారు.రానున్న రోజుల్లో అత్యధిక సభ్యత్వం కల సంఘంగా ఏర్పడటం ఖాయమని సంఘ బాధ్యులు ధీమా వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: