Thursday, 30 July 2026 07:20:51 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ..

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 14 May 2026 11:18 PM Views : 93

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2026-27 విద్యా సంవత్సరానికి గాను హైదరాబాద్ లోని బేగంపేటలో గల హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలలో 1వ తరగతిలో ప్రవేశం కొరకు షెడ్యూల్ కులములకు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 2 సీట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు జిల్లా నివాసులై ఉండి జూన్ 1, 2019 నుండి మే 31, 2020 మధ్య జన్మించి ఉండాలని, జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మీసేవ, మున్సిపల్ కార్పొరేషన్/ తహసిల్దార్ ద్వారా జారీ చేయబడి ఉండాలని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల రూపాయల లోపు ఉండాలని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, జనన తేదీ, నివాస ధ్రువపత్రాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేసి ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలని, జూన్ 1వ తేదీన డ్రా పద్ధతిన అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఇతర వివరాలకు జిల్లా షెడ్యూల్ అభివృద్ధి శాఖ కార్యాలయంలో పనివేళలలో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :