Friday, 31 July 2026 02:33:33 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బ్రతికుండగానే స్మశాన వాటికలో వదిలి వెళ్లారు...

Date : 21 March 2026 11:37 PM Views : 240

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తిని బతికి ఉండగానే కుటుంబం శ్మశానవాటికలో వదిలి వెళ్లిన ఘటన జగిత్యాలలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పట్టణంలోని మంచినీళ్లబావి ప్రాంతానికి చెందిన ఎండ్రికాయల శ్రీధర్ కు భార్య సునీత, ఇద్దరు కూతుళ్లున్నారు. ఉపాధి కోసం అయిదేళ్ల కిందట సౌదీ అరేబియా వెళ్లిన శ్రీధర్ ఓ కంపెనీలో పని చేసేవారు. వేతనం ఎక్కువే ఉన్నా జల్సాలకు అలవాటు పడి కుటుంబ సభ్యులను పట్టించుకోవడం మానేశారు. ఇక్కడ సునీత కూలీ పని చేస్తూ పిల్లలను పోషించారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీధర్ ను కంపెనీ స్వదేశానికి పంపింది. ఇంటికి వచ్చాక ఆయనకు కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం అందించారు. మూత్రపిండాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీధర్ ను కుటుంబసభ్యులు గురువారం రాత్రి పట్టణంలోని చింతకుంట శ్మశానవాటికలో వదిలివెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం అటువైపుగా వెళ్లిన వారు గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి అంబులెన్స్ లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సోదరుడు, భార్య తనను పట్టించుకోవడం లేదని శ్రీధర్ చెబుతున్నారు. కాగా శ్రీధర్ భార్యా పిల్లల పోషణను పట్టించుకోవడం లేదని, దీంతో వారు గాంధీనగర్లోని సునీత పుట్టింటికి వెళ్లారని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శ్రీధర్ కు జిల్లా ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :