Thursday, 30 July 2026 08:10:56 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అన్నదాతను అరిగోస పెడుతున్నవాళ్లను దేవుడు క్షమించిన ప్రజలకు క్షమించరు..! ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న ప్రజలు..

నాలుగుసార్లు రైతుబంధు ఎగొట్టిన ప్రభుత్వమిది... మరణించిన రైతు కుటుంబాలకు చెక్కులు అందజేసిన కేటీఆర్

Date : 21 July 2026 10:20 PM Views : 51

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అన్నదాతను అరిగోస పెడుతున్న వాళ్లను దేవుడు క్షమించిన ప్రజలు క్షమించే పరిస్థితి లేదని, ఇప్పటికే ప్రజలు విసిగి వేసారి పోయారని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా కెసిఆర్ ని ఎప్పుడు ముఖ్యమంత్రి చేద్దామా నాకు న్యాయం అప్పుడే జరుగుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం అంకతిపల్లిలో వాసవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే కానీ కాలం తెచ్చిన కరువు కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా కెసిఆర్ ఎప్పుడు వస్తాడా అని ప్రజల ఎదురు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి ఎల్ నినో ప్రభావం చేసిన నష్టం కంటే కాంగ్రెస్ చేసిన నష్టమే ఎక్కువన్నారు. కన్నెపల్లి లో ఉన్న వాటర్ ను రోజుకు మూడు టీఎంసీ ల చొప్పున అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి బ్యారేజ్ లకు బ్యాక్ వాటర్ ఎందుకు పంపడలేదు అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఒక్క ఎల్ నినో కాదు ఇంకొక ఎల్ నినో వచ్చిన మన రాష్ట్రానికి కరువు రాకుండా బ్యారేజ్ లు కట్టి బాహుబలి మోటార్లు పెట్టించిన ఘనత మన కేసీఆర్ దేనని అన్నారు. ఎన్నికలకు ముందు రైతుబంధు కెసిఆర్ కంటే ఎక్కువ ఇస్తా అని ప్రజలను మభ్యపెట్టి నాలుగు సార్లు ఎగొట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి అని ఏద్దేవా చేశారు. అంతే కాకుండా నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇలా ఇచ్చిన హామీలన్నిటిని తుంగలోతొక్కాడన్నారు. కాళేశ్వరంపై రేవంత్ రెండు పిల్లర్స్ దెబ్బతిన్నాయని చెప్పి,32 నెలలుగా ఎందుకు రిపేర్ చేయించ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద బూటకపు ప్రచారాలు చేస్తూ రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి వరంగల్ సభలో ఏక కాలంలో రైతులకు రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తానని మోసం చేశాడన్నారు. 32 నెలలు గడచిన ఎందుకు రుణమాఫీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదు అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన పద్దతిని మార్చుకోవాలని హెచ్చరించారు. నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలే తప్ప కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దన్నారు.

అదేవిధంగా అకాల వర్షానికి గోడలు కూలి రైతులు మరణిస్తే రెండున్నర నెలలు గడచినా వారికీ ఎలాంటి సహాయం అందలేదని బాధను వ్యక్తం చేశారు. చివరికి కే సీ ఆర్ ప్రవేశపెట్టిన రైతుభీమా ద్వారా ఒక్కరైతుకుటుంబానికి మాత్రమే రూ. 5లక్షలు అందాయన్నారు. మరణించిన నలుగురు రైతు కుటుంబాలకు రూ.5లక్షల చెక్కులను కే టీ ఆర్ అందజేశారు. ఇంకొ 28 నెలల్లో కెసిఆర్ ప్రభుత్వం వస్తుందని ఈ చేతకాని, రైతులను పట్టించుకోని ప్రభుత్వం పడిపోతుందని ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, సుంకే రవి, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, మాజీ ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, రాష్ట్ర నాయకులు విజిత్ రావు, మాజీ డీసీఎమ్మెస్ తిప్పని లింగయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ లు ఎల్తాపు సుధాకర్, మాజీ సర్పంచ్ సొల్లు సురేష్, మాజీ యూత్ అధ్యక్షులు మారిశెట్టి సుమన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :