Friday, 17 April 2026 05:02:19 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

విద్యార్థుల ఎదుగుదల కళాశాల స్థాయి నుంచే ప్రారంభమవుతుంది

డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

Date : 18 October 2025 07:07 PM Views : 187

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు ఎదుగుదల కళాశాల స్థాయినుంచె ప్రారంభమవుతుందని శ్రద్ధ, లక్ష్యంతో చదివినట్లయితే వారి భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు చేరుతుందని సిరిపురం ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శనివారం కాగజ్ నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్ లో నిర్వహించిన వసుంధర జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ప్రేషర్స్ డే వేడుకకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని లక్షల లక్షల అధిరూపాయలు ఖర్చు చేసి చదివిస్తున్నారని వారి యొక్క నమ్మకాన్ని అమలు చేయకుండా శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో రాణించినట్లయితే వారి ఆనందానికి అవధులు ఉండవన్నారు. ఉన్నత పాఠశాల విద్య వరకే తమ యొక్క చిలిపి చేష్టలు సాగుతాయని తర్వాత వచ్చే కళాశాల విద్య విద్యార్థి జీవితంలో మలుపు తీసుకువస్తుందన్నారు. విద్యార్థుల ఎదుగుదల కళాశాల స్థాయి నుంచే ప్రారంభం అవుతుందని , ఈ వయస్సులో మొబైల్ ఫోన్లకు, సోషల్ మీడియాకు, చెడు వ్యసనాలకు అట్రాక్ట్ అవకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి భవిష్యత్తులో మంచి స్థాయిలో నిలబడి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కళాశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మెమంటోలు అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు సంస్కృతి కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :