Friday, 31 July 2026 06:20:17 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బీసీ రిజర్వేషన్ల ఏర్పాటులో అవకతవకలు జరిగాయని బీసీ సంఘం చే రాస్తారోకో... వినతి...

Date : 24 November 2025 09:12 PM Views : 238

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బీసీబీసీ సంఘాల రిజర్వేషన్లలో అవకతవకలు జరగాయని ఆరోపిస్తూ సంఘాల రిజర్వేషన్లలో అవకతవకలు జరగాయని ఆరోపిస్తూ, వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి అందులో బీసీలకు రిజర్వేషన్లు 50% క్యాపు మించకుండా ఏర్పాటు చేయాలన్నప్పుడు 20% రిజర్వేషన్లు బీసీలకు ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడు 29 గ్రామపంచాయతీలలో సుమారు 7 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ కేటాయించవలసి ఉండగా కేవలం రెండు గ్రామపంచాయతీలు అయిన చింతలపల్లె, లింగయ్య పల్లె అనే చిన్న గ్రామాలను బీసీలకు రిజర్వేషన్ చేశారన్నారు. జన్నారం మండలం బిసి సంఘం తరఫున మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో షరీఫ్ కి వినతిపత్రం అందజేసి బీసీ రిజర్వేషన్లు సవరించి ఏడు స్థానాలు బీసీలకు కేటాయించే ఏర్పాటు చేయాలని జన్నారం మండలం బిసి సంఘం తరఫున వినతిపత్రం అందజేశారు. ఒక గంట సమయం ఇచ్చి ఉన్నత అధికారులను సంప్రదించి మార్పులు చేసే ప్రయత్నం చేయాలని కోరగా ఎంపీడీవో ఈ విషయం నా పరిధిలో లేదు అని అనడంతో జన్నారం మండల బీసీ సంఘం తరఫున ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో దాదాపు అరగంట వందలాది వాహనాలు రోడ్డుకి ఇరువైపులా ఆగిపోయాయి విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో చేస్తున్న స్థలాన్ని చేరుకొని నాయకులతో మాట్లాడి రాస్తారోకో విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు కాసెట్టి లక్ష్మణ్, బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య, కో కన్వీనర్ కడార్ల నర్సయ్య, మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ, మాజీ ఎంపిటిసి, మాజీ సర్పంచ్ కొంతం శంకరయ్య, పొనకల్ మాజీ ఉపసర్పంచ్ బిసి మంచిర్యాల జిల్లా కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్, పొనకల్ మాజీ ఎంపిటిసి రాగుల శంకర్, బీ ఆర్ ఎస్ జన్నారం మండలం ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్, సి పి ఐ ఎం జన్నారం మండల కార్యదర్శి కనికరపు అశోక్, మహిళా నాయకురాలు జయమ్మ, వాసాల నరేష్, మోకు దెబ్బ మంచిర్యాల డివిజన్ అధ్యక్షుడు ఒల్లాల నరస గౌడ్, ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆంధ్ర పురుషోత్తం, జన్నారం మండల బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి సంద గోపాల్, జన్నారం మండలం మాజీ మండల పరిషత్ వైస్ చైర్మన్ సుతారి వినయ్ మండల పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు లెక్కల మల్లయ్య ఆర్ టి సి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు గోపి, సత్యనారాయణ అప్పాల జలపత్, లసెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :