Thursday, 30 July 2026 12:40:37 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కలెక్టరేట్లో వినతి పత్రం అందజేత

Date : 04 December 2025 12:57 PM Views : 214

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : అక్రిడియేషన్ తో సంబంధం లేకుండా జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ డీజేఎఫ్ డబ్ల్యూ ఆధ్వర్యంలో బుధవారం పెద్దపెల్లి కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీజేఎఫ్ డబ్ల్యూ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికలు, చానల్స్ లో రిపోర్టర్లుగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. అందులో చాలామంది పేదరికంతో ఉన్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని, కనీసం సొంత ఇల్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సొంత ఇల్లు లేని జర్నలిస్టులకు అద్దె చెల్లించడం భారంగా మారిందన్నారు.10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి కాలం వెళ్లదీసిందన్నారు. జర్నలిస్టు సమస్యల నిర్లక్ష్యానికి పర్యవసానం, మూల్యం బిఆర్ఎస్ పార్టీ చెల్లించుకుంది. ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అదే కోవలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని,ఇండ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి రాష్ట్ర అధ్యక్షులు కోల శ్రీనివాస్, జాతీయ పిఆర్ఓ మామిడి స్వామి, మహిళా అధ్యక్షురాలు వోడ్నాల లత, ప్రధాన కార్యదర్శి కన్నూరి జేష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్, రావుల రాజ్ కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి మాదేశి శ్రావణ్ కుమార్ జర్నలిస్టులు మంథని లక్ష్మణ్, అసంపల్లి స్వామి, బంధాల రాజశేఖర్, బడికెల కృష్ణ, వోడ్నాల తిరుపతి, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :