Friday, 31 July 2026 07:24:03 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు

సీపీ.గౌస్ ఆలం...

Date : 31 March 2026 10:40 PM Views : 209

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రోడ్డు ప్రమాదాల నివారణ కేవలం పోలీసుల చర్యల తోనే సాధ్యం కాదని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి, వాటిని బాధ్యతా యుతంగా పాటించినప్పు డే ప్రమాద రహిత సమా జం సాధ్యమవుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు. మంగళవారం కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో, ఆటో డ్రైవర్లు , రాపిడో కెప్టెన్ల కోసం స్థానిక అస్త్ర కన్వెన్షన్ హాల్ నందు మంగళవారం ఏర్పాటు చేసిన ‘అరైవ్ - అలైవ్’ మూడవ దశ అవగాహనా కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.​​ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమానవ తప్పిదాలే మరణ శాసనంగా మారుతున్నాయన్నారు. గత ఏడాది కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మం ది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అజాగ్రత్త ల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నా యని తెలిపారు. ​బాధితుల్లో పురుషులే ఎక్కువ, ప్రమాదాల్లో మరణించిన వారిలో 85 శాతం మంది పురుషులే ఉండటం గమనార్హమని, ఒక వ్యక్తి మరణం ఆ కుటుంబం మొత్తాన్ని వీధిన పడేస్తుందని గుర్తు చేశారు.​బ్లాక్ స్పాట్లపై నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. కరీం నగర్ నుండి హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, సిరి సిల్ల మరియు చొప్పదండి వెళ్లే రహదారుల్లో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ‘బ్లాక్ స్పాట్లను’ గుర్తించామని అన్నారు.అక్కడ గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా హుజురాబాద్ లింగాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఇప్పటికే సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి డ్రైవర్ పరిసరాలను గమనిస్తూ వాహనం నడిపే ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ పద్ధ తిని అలవరచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బందితోపాటు పలు రకాల వాహనాలు నడిపే డ్రైవర్లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :