Thursday, 30 July 2026 07:17:20 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

జైపూర్ లో నార్కోటిక్స్ డాగ్స్ స్క్వాడ్ తనిఖీలు..

Date : 23 May 2026 10:24 PM Views : 79

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం జైపూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జైపూర్, ఇందారం బస్టాండ్స్ లో, మరియు పరిసర ప్రాంతాలలో పోలీస్ సిబ్బంది, యాంటీ నార్కోటిక్స్ వింగ్ మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు జైపూర్ సిఐ నవీన్ కుమార్, ఎస్సై భూమేష్ లో హెచ్చరించారు. జైపూర్ పోలీస్ స్టేషన్, మంచిర్యాల నార్కోటిక్ టీమ్ సమన్వయంతో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ సహకారంతో జైపూర్ బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటళ్లు, పాన్ షాపులు, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు, చిన్నపిల్లలకు మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్లు, గుట్కా, సిగరెట్లు వంటి నిషేధిత వస్తువులు విక్రయించిన పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలని జైపూర్ ఎస్సై భూమేష్ సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై భూమేష్ తెలిపారు. ఈ తనిఖీలలో యాంటీ నార్కోటిక్ వింగ్ సిబ్బంది, జైపూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :