ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో దాదాపు 200 మంది శనివారం చేరారు. చేరిన వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్త సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా మంచిర్యాలలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని పాలించిన 7 గురు ఎమ్మెల్యేలు చేయని అభివృద్ధిని నేను చేశానన్నారు. సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు రెండు నెలల్లో శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంలోని 282 పాఠశాలల్లో విద్య వ్యవస్థను ఆధునికరిస్తున్నా మన్నారు. కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి కోసం 150 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించానని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో త్రాగునీరు, సాగు నీటికి, మౌలిక సదుపాయాలకు ప్రజలు అనేకఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద 600 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దండేపల్లి, లక్షెట్టిపేట్ మండలాల్లోని మోదెల, ద్వారక, గుడి రేవు, గూడెం గ్రామాలలో 4 మినీ లిఫ్ట్ నిర్మాణ పనులను అతిత్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా మంచిర్యాల నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల ను మంజూరు చేశామన్నారు. ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు ప్రజలను ఓటు అడిగే అర్హత లేదన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో 60 సీట్లు సాధించి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని నా అన్నదమ్ములుకి అక్క చెల్లెలుకి ఏ ఆపద వచ్చినా మీ అందరికీ నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు , నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News