Friday, 31 July 2026 10:36:17 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పూలే స్ఫూర్తితో ఉపాధిహామిని కాపాడుకుందాం

ఉపాధి కూలీల మధ్యన ఘనంగా పూలే జయంతి

Date : 11 April 2026 10:26 PM Views : 97

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల మధ్యన జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా స్త్రీ జాతి విముక్తి కోసం అనేక పోరాటాలు చేసిన గొప్ప ఉద్యమకారుడన్నారు. ఆర్థిక సమానత్వం కోసం తన తుది శ్వాస వరకు పోరాటం చేసిన గొప్ప మహానీయుడని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆయన ఆశయాలకు భిన్నంగా దేశంలో కులం మతం ప్రాంతం పేరుతో వైశ్యామ్యాలు సృష్టిస్తూ ప్రజల మధ్యన అనైక్యతను సృష్టిస్తుందని విమర్శించారు. గ్రామీణ పేదలకు ఆసర గా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి జి రాంజీ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. జి రాంజీ పథకం రావడం వల్ల గ్రామంలో కూలీలు ఉపాధి హామీ కూలీలు పనుల పట్ల శ్రద్ధ చూపడం లేదని పనులకు రావటం లేదని వేరే ఇతర పనులకు వెళుతున్నారని అన్నారు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి మొత్తం పథకాన్ని రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. జ్యోతిబాపూలే ఆశయాలకు అనుగుణంగా ఆయన పూర్తితో గ్రామీణ పేదలంతా ఐక్యమై ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గొర్రెంకల సురేష్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఏల్పుల సురేష్, బాబు రవి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :