ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : టీజీఎస్ఆర్టిసి ఉద్యోగుల సహజ మరణానికి యు.బి.ఐ రూ.10 లక్షల బీమా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన సిబ్బందికి సామాజిక భద్రతను మరింత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సహజ మరణం పొందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.10లక్షల ఉచిత బీమా సొమ్ము ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వచ్చిందని, దీనికి ఉద్యోగులు రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలోని రూ.కోటి ప్రమాద బీమా యథాతథంగా ఉంటుందని తెలిపింది.
Admin
E Nivas News