Friday, 31 July 2026 12:39:54 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

తుఫాను కారణంగా పత్తి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Date : 18 November 2025 07:45 PM Views : 251

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ పత్తి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. 2025–26 పత్తి కొనుగోలు సీజన్ నేపథ్యంలో, కేంద్ర టెక్స్టైల్స్ యూనియన్ మంత్రిగిరిరాజ్ సింగ్ జీ కి మంగళవారం ఎంపీ అధికారిక లేఖ పంపి పలు కీలక సూచనలు చేశారు. సీసీఐ ప్రతిపాదించినట్టు రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు తగ్గించడం తప్పు నిర్ణయం అని ఎంపీ పేర్కొన్నారు. ఈ అంచనా రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టర్లు మరియు వ్యవసాయ శాఖ డైరెక్టర్ సమర్పించిన ధృవీకరించిన డేటాకి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 6,680 ఎంఎంటిలు పత్తి కొనుగోలు కాగా, 3,175 మంది రైతులు లబ్ధి పొందారు. పత్తి కొనుగోలు మొత్తం విలువ ₹52.25 కోట్లు, అందులో ₹15.04 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటికే మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి మరింత దెబ్బతింటుందని, దిగుబడి అంచనాలను తగ్గించే నిర్ణయాన్ని పునర్విమర్శించాలని ఎంపీ వంశీ కృష్ణ కోరారు. అదేవిధంగా, పత్తి మిల్లర్లు & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సూచించిన మాయిశ్చర్ నార్మ్స్, L1/L2 విభజన సమస్య, స్లాట్ బుకింగ్ కష్టాలు, జిన్నింగ్ మిల్లుల కార్యకలాపాల సమస్యలు వంటి అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సానుకూల చర్యలను ఎంపీ ప్రశంసించారు. టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్, 176 మార్కెట్ యార్డుల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు, సీసీఐతో కలిసి జిన్నింగ్ మిల్లుల మ్యాపింగ్, అవగాహన కార్యక్రమాలు రైతులకు మేలు చేస్తాయని తెలిపారు. ఎంపీ వంశీ కృష్ణ పలు ప్రధాన డిమాండ్లను కోరారు.రాష్ట్ర సగటు పత్తి దిగుబడి 11.74 క్వింటాళ్లుగా కొనసాగిం చాలన్నారు. మాయిశ్చర్ పరిమితిని 20% వరకు సడలించాలన్నారు. మిల్లర్లు, ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ చర్యలతోనే రైతులకు న్యాయమైన ధరలు మరియు సాఫీ కొనుగోలు ప్రక్రియ సాధ్యమవుతుందని ఎంపీ గడ్డం వంశీ కృష్ణ స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :