Sunday, 26 April 2026 02:14:05 AM
# భారీ పెట్టుబడి మోసం కేసులో కీలక నిందితురాలు అరెస్ట్ # ఆశ ఉండొచ్చు.. అత్యాశ ఉండొద్దు. # ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా నిర్వహించేందుకు కీలక మార్పులు చేశాం.. # ఈ నెల 27న ప్రజావాణి రద్దు # ఆర్టీసీ కార్మికులు అధైర్యానికిలోనుకావద్దు # తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా నిర్వహించేందుకు కీలక మార్పులు చేశాం..

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు

Date : 25 April 2026 11:04 PM Views : 5

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : యాసంగి 2025-26 సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సాఫ్ట్ వేర్ లో ప్రభుత్వం కీలక మార్పులు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు సమీపంలో ఉన్న రైస్ మిల్లులకు ధాన్యం తరలించడం జరుగుతుందని, ప్రతి రైస్ మిల్లు సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని తదనుగుణంగా ధాన్యం కేటాయించేలా ఆధునీకరించడం జరిగిందని, ఈ మార్పుతో రవాణా సమయం, కొనుగోలు ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసిన తర్వాత గతంలో మాదిరిగా మాన్యువల్ ట్రక్ షీట్ ఉండదని, ఆన్ లైన్ లో మాత్రమే ట్రక్ షీట్ జనరేట్ చేయబడుతుందని, కొనుగోలు కేంద్రం, మిల్లుల టాకింగ్ ఆటోమేటిక్ గా అవుతుందని, ఆన్లైన్ లో జనరేట్ అయిన ట్రక్ షీట్ ను కొనుగోలు కేంద్రాల వారు ప్రింట్ తీసి ధాన్యపు లారీ వెంబడి మిల్లుకు పంపించాలని, ధాన్యం లారీ పక్కదారి పట్టకుండా జిపిఎస్ పరికరం బిగించబడి ఉంటుందని తెలిపారు. రైతు వివరాలను సిస్టం లో నమోదు చేసి ఆధార్ కార్డు ద్వారా వారి గుర్తింపును దృవీకరించాలని, రైతు భూమి విస్తీర్ణం, పండించిన ధాన్యం వివరాలను సరి చూడాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే విధంగా పరిశీలించాలని, నాణ్యత అయితేనే రైతులకు గోనె సంచులు అందించాలని తెలిపారు. సంచులలో ధాన్యం నింపి కేంద్రం వద్ద తప్పనిసరిగా తూకం వేయాలని, రైతు ఆధార్ నిర్ధారణ ద్వారా ధాన్యం విక్రయాన్ని  ధ్రువీకరించాలని, తూకం వేసిన ధాన్యాన్ని జిపిఎస్ కలిగిన ట్రక్కులలో లోడ్ చేయాలని తెలిపారు. ఓ పి ఎం ఎస్ ద్వారా ట్రక్ చిట్ జనరేట్ చేయాలని, మిల్లు కేటాయింపు పూర్తిగా ఆటోమేటిక్ గా జరుగుతుందని తెలిపారు.  మిల్లర్లు ధాన్యాన్ని స్వీకరించి ఓపియంఎస్ లో అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారని, మిల్లర్ నిర్ధారణ అనంతరం ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా నగదు జమ చేస్తుందని తెలిపారు. జిల్లాలోని రైతులు ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :