ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని లోని కాకతీయ హైస్కూల్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, అలోక్ పబ్లిక్ స్కూల్, గర్ల్స్ హై స్కూల్ లో విశ్వ హిందూ పరిషత్ మంథని ప్రకండ ఆధ్వర్యంలో విద్యార్థులకు రామాయణం పరీక్ష పోటీలు నిర్వహించడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్ మాట్లాడుతూ ప్రతి స్కూల్ నుండి 3,4,5 తరగతుల నుండి ముగ్గురు విజేతలను, 6,7 తరగతుల నుండి ముగ్గురు విజేతలను 8,9,10 తరగతుల నుండి ముగ్గురు విజేతలకు విశ్వ హిందూ పరిషత్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధముగా ఈ పోటీ పరీక్షలో 4 పాఠశాలల నుండి గెలిచిన విద్యార్థులకు ఈ నెల 11న శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయ ప్రాంగణం లో మరొక రామాయణం పోటీ పరీక్ష పెట్టి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, ప్రకండ బాధ్యులు రావుల సతీష్, ప్రధాన కార్యదర్శి వడ్ల కొండ శ్రావణ్, సత్సంగ ప్రముక కొమురవెల్లి హరీష్ గుప్తా, సహ కర్యదర్శి గుండా శ్రీనివాస్, ప్రచార ప్రముక తూర్పాటి రాము, ఉపాధ్యక్షులు మెడగొని రాజమౌళి గౌడ్, సబ్యులు చింతకింది చరణ్, మాతృ శక్తి సంయోజక రావికంటి రేణుక, సహా సంయోజక్ కొత్త పుష్పలతలు పాల్గొన్నారు.
Admin
E Nivas News