Friday, 31 July 2026 07:11:47 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం....

ఎంపీ. గడ్డం వంశీకృష్ణ

Date : 09 May 2026 12:17 AM Views : 184

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా గంపల పెళ్లి కొత్తూరు గ్రామాలలో జరిగిన ప్రమాదంలో గోడ కూలి రైతులకు మృతి చెందగా ఆ ప్రదేశాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, లక్షెట్టిపేట తహసిల్దార్ దిలీప్ కుమార్, డి సి సి ప్రతినిధి రఘునాథ్ రెడ్డి, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. అకాల వర్షం కారణంగా లక్షెట్టిపేట మండలం కొత్తూరు లోని కొనుగోలు కేంద్రంలో జరిగిన ప్రమాదంలో రైతులు మృతి చెందడం బాధాకరమని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారంలో భాగంగా రవాణా ప్రక్రియలో లారీ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, కొత్తూరు కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ధాన్యాన్ని నెల్కివెంకటాపూర్ లోని గోదాముకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అకాల వర్షం కారణంగా ప్రమాదంలో మృతి చెందిన కొత్తూరు గ్రామానికి చెందిన వెంకటేష్, గంపలపల్లి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు తనుగుల నాగరాజు, అభిరామ్ కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కి లచ్చన్న కుటుంబాన్ని జిల్లా కలెక్టర్, దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే లతో కలిసి పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ముందుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, లక్షెట్టిపేట మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి మండలంలోని మిట్టపల్లి లో శ్రీరామకృష్ణ ట్రేడర్స్ రైస్ మిల్లును సందర్శించి అక్కడ నెలకొన్న లారీ ధాన్యం దిగుమతి, హమాలీల సమస్యను పరిష్కరించే దిశగా వారితో సమీక్షించారు. ప్రభుత్వం లారీలతో పాటు ట్రాక్టర్ల ద్వారా ధాన్యం రవాణాకు అవకాశం కల్పించిందని, లారీల నిర్వాహకులు సహకరించాలని, ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతంగా జరిగేలా హమాలీలు కలిసి రావాలని తెలిపారు. ఈ నేపథ్యంలో హమాలీలు, లారీల నిర్వాహకులు జిల్లా కలెక్టర్ చెప్పిన అంశాలను అంగీకరించడంతో పరిస్థితి అనుకూలంగా మారింది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: