ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల నిర్వ హణ ప్రక్రియ కొనసాగు తున్న నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం పురపాలక ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసునట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ విష యాన్ని గమనించి యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.
Admin
E Nivas News