ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండలం దౌడపల్లి గ్రామానికి చెందిన మేడి రాజేశ్వరి 53 మహిళ శనివారం ప్రమాదవశాత్తు ఆటోలో నుండి కిందపడి తలకు తీవ్ర గాయమై మృతి చెందినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు దౌడేపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట మనిషిగా పనిచేస్తుంది. రోజు మాదిరిగా మృతురాలు రాజేశ్వరి తన పని ముగించుకొని తమతో పాటు పనిచేసే వాళ్ళతో కలిసి అదే గ్రామానికి చెందిన అమీర్ పాష ఆటోలో ఇంటికి వస్తుండగా తన ఇంటి సమీపంలో ప్రమాదవశాత్తు ఆటోలోంచి కిందపడి పోగా స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతురాలి భర్త మేడి నరసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామన్నారు.
Admin
E Nivas News