Friday, 31 July 2026 03:36:35 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రజలకు సిబ్బందికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Date : 01 January 2026 09:43 PM Views : 202

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఆంగ్ల నూతన సంవత్సరం 2026 పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుభాకాంక్షలు తెలిపారు.స్థానిక పోలీసు క్యాంపు కార్యాలయం లో జిల్లా ఎస్పీ, పోలీసు సిబ్బంది సమక్షంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీకి ప్రజలు, అధికారులు పుష్పగుచ్చం, పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది సంవత్సర కాలం పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, విజయవంతంగా కొనసాగాలని, ప్రజలకు నిస్వార్ధమైన సేవలందిస్తూ, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా, శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం నిర్విరామంగా విధులను నిర్వర్తిస్తూ సేవలందించాలని సూచించారు. సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసి ప్రతి ఒకరు మరింత నూతన ఉత్సాహంతో ఈ సంవత్సరం విధులను నిర్వర్తించాలని సూచించారు. ప్రజారక్షణలో జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం పాటుపడుతూ పరిరక్షిస్తూ ఉంటుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రజలకు మరింత చేరువై సేవలందిస్తూ జిల్లా పోలీసుల కీర్తి ప్రతిష్టలను ఉన్నత స్థాయికి చేర్చాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా ఎస్పీకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎఎస్పీ పి మౌనిక ఐపీఎస్, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, పోలీసు కార్యాలయం ఏవో భక్త ప్రహ్లాద, సిఐలు, ఎస్ఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది, ఎన్ఐబి, స్పెషల్ బ్రాంచ్, ఫింగర్ ప్రింట్, డిసిఆర్బి, ఐటి కోర్, పోలీసు ముఖ్య కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :