ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. సోమవారంమండలంలోని జెండావెంకటపూర్ గ్రామ పోలింగ్ కేంద్రాన్ని డీసీపీ భాస్కర్ ఏసీపీ ఆర్. ప్రకాష్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిడులు, బెదిరింపులు లేకుండా మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని డీసీపీ ప్రజలను ప్రోత్సహించారు. గ్రామాల్లో ఎవరికైనా ఎన్నికల ప్రచారం చేయడానికి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుందని శాంతియుత వాతావరణం లో పారదర్శక ఎన్నికల కోసం తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలని డీసీపీ పోలీసు అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, భద్రత, సరైన బారికేడింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందేది ఓటు హక్కుతోనే అందరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఆర్. ప్రకాష్, లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్, ఎ ఎస్సై అన్వర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News