ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కళాశాలలో ముందస్తు ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అధ్యాపకులు విద్యార్ధులు అందరూ సంప్రదాయ దుస్తులతో వేడుకలకు హాజరై కొత్తదనం చూపారు. ఈ సంద్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఉగాది తెలుగు వారి నూతన సంవత్సరం అని తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలు ఆదర్శ ప్రాయమనిపేర్కొన్నారు. వ్యవసాయం పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ఈ నూతన పరాభవ నామ సంవత్సరం కొత్త విజయాలను తీసుకు రావాలని ఆకాంక్షించారు. యువతరం తెలుగు వారి సాంప్రదాయ ఆచారాలు కాపాడుకోవాలని తెలిపారు. అనంతరం జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ప్రముఖ వేద పండితులు గుడ్ల సురేష్ పంచాంగ శ్రవణo చేసి అందరికీ ఈ సంవత్సరం రాశి ఫలాలు తెలిపారు. పంచాంగ శ్రవణం విన్నవారికి కష్టాల నుండి ఉపశమనం కలుగు తుందని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్ధుల కవి సమ్మేళనం సాంస్కృతిక ప్రదర్శనలు ఆకటటుకున్నాయి. ఉత్తమ కవిత్వం రాసిన విజయ్, సాగర్, అక్షిత విద్యార్థులను ప్రిన్సిపాల్ డా మహాత్మా సంతోష్ చేతుల మీదుగా సన్మానించారు. ఉగాది పచ్చడి ఉగాది ప్రసాదం వితరణ చేశారు. కార్యక్రమoలో వైస్ ప్రిన్సిపల్ డా. సంతోష్ కుమార్ తెలుగు విభాగం అధ్యక్షులు కార్యక్రమం కో ఆర్డినేటర్, డా. తన్నీరు సురేష్ కార్యక్రమం అధ్యాపకులు, శంకరయ్య, ప్రేమలత , నాగేశ్వర్, చంద్రశేఖర్, శ్రీనివాస్, కవిత, సంధ్యారాణి, రాజ్ కుమార్, మల్లయ్య, స్వామి కాంతయ్య, ప్రసన్న , నివేదిత, రాజేశం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, బోధన బోధనేతర సిబ్బంది విద్యార్ధులు పాల్గొన్నారు.
Admin
E Nivas News