ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి అదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా జాతర ఈ నెల 18న ప్రారంభం కానుంది. ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరు అవుతారు. ఈ నేపథ్యంలో దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కలిసిఈ నెల 18న నాగోబా ఆలయంలో మహాపూజ మరియు 22న దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలకు పాల్గొనాలని కోరుతూ ఆహ్వాన పత్రం అందించారు.
Admin
E Nivas News