Thursday, 30 July 2026 09:44:23 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు..

Date : 21 June 2026 09:23 PM Views : 90

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు చిన్న,పెద్ద,ముసలి, ముతక అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగాp పలువురు యోగా గురువులు వారికి పలు ఆసలాన వల్ల కలిగే లాభాలనువివరించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కూడా యోగా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని విజడం పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 10 తెలంగాణ బెటాలియన్, ఎన్‌సీసీ వరంగల్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని విజ్ డమ్ హైస్కూల్ లో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 320 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొని యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగానిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు ప్రసాద్ యోగా వల్ల కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను వివరిస్తూ పలు రకాల ఆసనాలనువిద్యార్థులచే చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శివజ్యోతి మాట్లాడుతూ ధ్యానం (మెడిటేషన్) యొక్క ప్రాముఖ్యతను, దాని ద్వారా లభించే మానసిక ప్రశాంతతను వివరించి అవగాహన కల్పించారు. అలాగే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ మంగ విద్యార్థులతో కలిసి యోగ ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో విజ్ డమ్ హై స్కూల్ డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్లు పాల్గొని మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ప్రతి రోజూ యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఆరోగ్యవంతమైన జీవనం అలవడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హవల్దార్ కమలాకర్, విజ్ డమ్ హై స్కూల్ ఎన్‌సీసీ సెకండ్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్, బాలాజీ టెక్నో స్కూల్ సెకండ్ ఆఫీసర్ రియాజుద్దీన్, శివానీ పబ్లిక్ స్కూల్ సెకండ్ ఆఫీసర్ రాజు, సైనిక్ స్కూల్ లెఫ్టినెంట్ కిరణ్, డఫోడిల్స్ హై స్కూల్ సీటీఓ వెంకటరత్నం, గీతాంజలి హై స్కూల్ వెంకన్న, విజ్ డమ్ హై స్కూల్ వీరభద్రయ్య, పిఈటి లు రియాజ్, రాజేష్ , మధు, అనూప తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం ముగింపులో వక్తలు మాట్లాడుతూ, “యోగ ఆరోగ్యకరమైన జీవనానికి మూలాధారం. ప్రతి ఒక్కరూ యోగాను తమ నిత్య జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలి” అని పిలుపునిచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :