ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం పుట్టపాక యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షునిగా రేపాక లక్ష్మణ్ నియామకమైనట్లు సాదుల శ్రీకాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబుల సూచన మేరకు మంథని యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో మంథని మండలం పుట్టపాక గ్రామంలో యూత్ కాంగ్రెస్ నూతన గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రేపాక లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా కన్నూరి జగదీష్, ప్రధాన కార్యదర్శిగా ఐలి సతీష్, కార్యదర్శిగా ఇల్లుటం శివమణి, కోశాధికారిగా కన్నూరి సదయ్యా, అధికార ప్రతినిధిగా కల్వల యశ్వంత్, ప్రచార కమిటీ కన్వీనర్ గా ఎండి ఫయాజ్, కార్యవర్గ సభ్యులు రోడ్డ నరేష్, కన్నూరి సాయికుమార్, పవన్ కళ్యాణ్, బాబు, మునిగళ్ళ ప్రదీప్, కన్నూరి సుదర్శన్, రొడ్డ రాము, వెంకటేష్, ఆవుల సంపత్, మామిడి ఆదిత్య, చట్లపల్లి మణిదీప్, కొండపర్తి రాజేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మంథని యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, మాజీ సర్పంచ్ ఐలి శ్రీనివాస్ లు మాట్లాడుతూ గత పది సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అనేక పార్టీ కార్యక్రమలను విజయవంతం చేసుకుంటూ ముందుకు వచ్చారని, వారి సేవలను గుర్తించి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆదేశానుసారం నూతన కమిటీల నియామకం చేస్తున్నామన్నారు. నియోజక వర్గం అభివృద్ధి కోసం గడిచిన 20 నెలల్లో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వేల కోట్ల నిధులు తీసుకువచ్చారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త క్రృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చాట్లపల్లి సంతోష్, ఉపాధ్యక్షులు ఎడ్ల శ్రావణ్, నాయకులు కాల్వల రాజేశం, పోరెడ్డి తిరుపతి రెడ్డి, కన్నూరి రాజబాబు, శ్రీనివాస్, మిట్ట రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News