ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పట్టణ ప్రజలు తమ ఇంటి పన్ను, నీటి పన్ను మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను సకాలంలో చెల్లించి ఆసిఫాబాద్ పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకాష్ కోరారు. శనివారం ఆసిఫాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 16వ వార్డులో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌లో ఆయన వైస్ చైర్ పర్సన్ ఎండి అహ్మద్, కమిషనర్ గజానంద్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని, ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను మహిళలు తడి, పొడి మరియు హానికర వ్యర్థాలుగా వేరు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్దే హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎండి అహ్మద్ మాట్లాడుతూ దోమల నివారణకు వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి మందు స్ప్రే చేయిస్తున్నామని, ప్రజలు తమ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులలో ప్రస్తుతం పన్నుల వసూలు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, బకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించి మున్సిపల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 16 వ వార్డు కౌన్సిలర్ దూడల లక్ష్మి, బీఆర్ఎస్ నాయకుడు దూడల అశోక్, మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News